Sing Geetham: క్రేజీ కాన్సెప్ట్‌తో దూసుకుపోతున్న.. ‘హలో బాసు’ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి విలక్షణమైన క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన 90 ఏళ్ల అద్భుత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన మార్క్ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న సరికొత్త ప్రాజెక్టే ‘సింగ్ గీతం’. ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘హలో బాసు’ సాంగ్ ఒక క్రేజీ కాన్సెప్ట్‌తో సాగుతూ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) మార్క్ ఎనర్జిటిక్ ట్యూన్‌తో వచ్చిన ‘హలో బాసు’ సాంగ్ వీడియో ఎంతో ఫన్నీగా, వినూత్నంగా సాగింది. ఈ పాటలో ప్రధాన నటుడు వంశీ భారీ హ్యాంగోవర్‌తో ఉదయం నిద్రలేవగానే ఆయన గొంతు మారిపోతుంది. సాధారణంగా మాట్లాడదామని ప్రయత్నిస్తే.. మాట్లాడే బదులు గొంతులోంచి వింతగా పాటలు (గానం) వస్తుంటాయి. కేవలం ఆయనకే కాదు, ఆ ఊరిలోని వారందరికీ కూడా మాట్లాడితే పాటలు వచ్చే ఇలాంటి వింత సమస్యే వచ్చి పడిందని ఒక చిన్న పిల్లాడు వచ్చి చెప్పడంతో సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఫన్‌గా మారుతుంది.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
అయితే సాంగ్ లాంచ్ ఈవెంట్లో నాగ్ అశ్వి మాట్లాడుతూ.. ‘సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్‌ను పంచుకున్నారు. “సింగీతం శ్రీనివాసరావు గారిపై ఉన్న అపారమైన గౌరవంతోనే మేం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిజానికి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఆయన తన క్లాసిక్ హిట్ ‘పుష్పక విమానం’ సినిమా కంటే ముందు నుంచే అనుకుంటున్నారు. అప్పట్లోనే ఈ వినూత్నమైన కథను ఉలగనాయగన్ కమల్ హాసన్‌కు కూడా వినిపించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు వైజయంతీ మూవీస్ ద్వారా ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది’ అని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!