Director Bobby: మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ, చిరుతో తనకున్న అనుబంధం గురించి, ఆయనను చూడడానికి, కలవడానికి పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. చిన్నతనం నుంచి చిరును కలవడం కోసం ఆయన ఇంటిముందు వెయిట్ చేయడం, ఆయన సినిమా కోసం పోలీసులతో దెబ్బలు తినడం అన్ని చెప్పుకొచ్చాడు. ఇక ఆయనతో కలిస్ దిగిన ఫొటోలో చిరు కోపంగా ఉన్నారని, అయితే ఆ కోపం నేను రెండు సార్లు ఫోటో దిగడానికి వచ్చినట్లు ఆయన గుర్తించడమే అని చెప్పుకొచ్చాడు. ఇక తనను నిలబెట్టింది మాస్ మహారాజా రవితేజ అని, ఆయనతో తీసిన బలుపు సినిమాతోనే తాను డైరెక్టర్ గా నిలబడినట్లు తెలిపాడు.
ఎన్ని సినిమాలు చేసినా చిరును కలిసే ఛాన్స్ కోసం ఎదురుచూసానని, సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో చిరును చూసి చెమటలు పట్టేసినట్లు చెప్పాడు. ఇక చిరుతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు సెకండాఫ్ ఏది లేకుండానే ఫస్టాఫ్ చెప్పానని, అది విన్న చిరు.. కథ లేదు బాబీ.. ఎమోషన్స్, సెంటిమెంట్ ఉండేలా చూసుకో అని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అదే సమయంలో కథ కోసం అన్ని సినిమాలు చూస్తున్న తరుణంలో రవితేజ పాత్ర పుట్టుకొచ్చిందని, అదే విషయాన్నీ నిర్మాతలు కు చెప్పి అందరం కలిసి చిరును కలిసి చెప్పగా.. ఒక మెగాస్టార్ ఉండగా.. మరో హీరో ఎందుకు అనకుండా ఇదే కథను మనం చేస్తున్నామని తనను నమ్మి కథను చేసినందుకు చిరంజీవి కి థాంక్స్ చెప్పారు. ఇక ఇదే విషయాన్నీ రవితేజకు చెప్పడం వెంటనే ఆయన కూడా ఒప్పుకోవడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో చేసిన ప్రతిఒక్క నటులకు, టెక్నీషయన్ కు బాబీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు.