యాక్షన్ హీరో గోపీచంద్ మరియు దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలని ఇచ్చారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతూ ‘రామబాణం’ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గోపీచంద్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘విక్కీ’గా గోపీచంద్ నటిస్తున్న రామబాణం సినిమాలో హీరోయిన్ గా ‘డింపుల్ హయాతి’ నటిస్తోంది. ఈరోజు ఉమెన్స్ డే మరియు హోలీ పండగ కావడంతో రామబాణం సినిమా నుంచి డింపుల్ హయాతీ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎత్నిక్ వేర్‌లో సింపుల్ అండ్ బ్యూటీఫుల్ గా కనిపించిన డింపుల్ హయతి రామబాణం సినిమాలో ‘భైరవి’ అనే అమ్గామాయిగా కనిపించనుంది.
Read Also: Kriti Sanon: వరుణ్ ధావన్ వల్ల ప్రభాస్ కి సారీ చెప్పాల్సి వచ్చింది…
అనౌన్స్మెంట్ వీడియోలో కాబ్ దిగి స్టైల్‌గా ఫ్రేమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. మిక్కీ జె మేయర్ ఈ వీడియోకి కూల్ బ్రీజ్ లాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, గోపీచంద్ కి అన్న పాత్రలో కనిపించనున్నాడు. గతంలో గోపీచంద్, జగపతి బాబు అన్నదమ్ములుగా నటించిన సినిమా మంచి హిట్ గా నిలిచింది. గోపీచంద్ స్ట్రెంగ్త్ ఏంటో పర్ఫెక్ట్ గా తెలిసిన దర్శకుడు శ్రీవాస్ సామాజిక సందేశంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన కథాంశంతో రామబాణం సినిమాని రూపొందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో తెలియాలి అంటే మే 5 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Introducing,
The Leading Lady from #Ramabanam – @DimpleHayathi as #Bhairavi ❤️Wishing a #HappyHOLI & #HappyWomensDay 😊✨#RamabanamOnMay5 🏹
Macho Starr @YoursGopichand @DirectorSriwass @vishwaprasadtg @MickeyJMeyer @vivekkuchibotla @IamJagguBhai… https://t.co/NlbtJfUVPv pic.twitter.com/nez0wUOSCR
— People Media Factory (@peoplemediafcy) March 8, 2023