Site icon NTV Telugu

Dil Raju: బుట్టబొమ్మ జపం చేస్తున్న బడా నిర్మాత..?

pooja hegde

pooja hegde

ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తున్న సినిమాల లైన్ పెరిగిపోవడంతో పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన పూజా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ బడా నిర్మాత బుట్టబొమ్మ జపం చేస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అని.. ఆమె ఉంటే  సినిమా హిట్ అని బీస్ట్ వేడుకలో అమ్మడిని ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే.

ఇక  తాజాగా బీస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. పూజా గురించి మరోమారు పొగడ్తల వర్షం కురిపించాడు. ‘పూజా హెగ్డే లక్కీ గర్ల్‌గా మారింది, టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరితోనూ నటించి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ని అందుకుంటుంది. ఇప్పుడు బీస్ట్ కూడా హిట్ ని అందుకుంటుందని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే విజయ్- వంశీ పైడిపల్లి సినిమాలో కూడా మొదట పూజానే తీసుకుందామని అనుకున్నాం.. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదు.. అంతేకాకుండా బీస్ట్ వెంటనే మళ్లీ విజయ్ తో కాంబో రిపీట్ అవ్వడం ఎందుకు అని పూజా ప్లేస్ లో రష్మికను తీసుకున్నాం@ అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో సోషల్ మీడియా లో మరోసారి పూజా- త్రివిక్రమ్ ల చర్చ మొదలయ్యింది. మొన్నటివరకు త్రివిక్రమ్ ఒక్కడే పూజా జపం చేస్తున్నాడని అనుకున్నారు.. ఇక ఇప్పుడు తాజాగా బడా నిర్మాత కూడా పూజా జపం చేస్తున్నారు. వీరి మధ్యలో ఏం జరుగుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ లక్కీ చార్మ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version