Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dil Raju Suggested Changes In Script To Gautam Tinnanuri For Vijay Deverakonda Project

Dil Raju: విజయ్ దేవరకొండ సినిమాకి బ్రేక్ వేసిన దిల్‌రాజు..?

Published Date :October 29, 2022 , 8:18 pm
By NTV WebDesk
Dil Raju: విజయ్ దేవరకొండ సినిమాకి బ్రేక్ వేసిన దిల్‌రాజు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dil Raju: లైగర్ ఫ్లాప్ అయ్యాక పూరీ జగన్నాథ్‌తో చేయాల్సిన ‘జన గణ మన’ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలుత ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, ఇప్పుడు సీన్‌లోకి దిల్ రాజు వచ్చాడు. సమంతతో విజయ్ చేస్తున్న ‘ఖుషీ’ సినిమా ముగిసిన వెంటనే, ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా ప్లాన్ కూడా వేసుకున్నారు. అయితే, ఇంతలో దిల్‌రాజు దర్శకుడికి ఒక చిన్న ఝలక్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని, గౌతమ్‌కి సూచించాడట!

సినిమాలపై మంచి పట్టు ఉన్న నిర్మాతల్లో.. దిల్‌రాజు ఒకడని చెప్పుకోవడంలో సందేహం లేదు. ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి? ఏయే హీరోలకు ఎలాంటి స్టోరీలు సెట్ అవుతాయి? ఏ హీరో నుంచి జనాలు ఏం కోరుకుంటారు? అనే విషయాలపై ఆయనకు పట్టు ఉంది. అందుకే, ఈయన నిర్మించిన సినిమాల్లో కొన్ని మాత్రమే ఫ్లాప్ అయితే, మిగతావన్నీ భారీ విజయాలు సాధించాయి. తనకున్న ఆ అనుభవంతోనే.. విజయ్ ఇమేజ్‌కి తగినట్టు కొన్ని ఎలిమెంట్స్ జోడించాలని, స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో.. డైరెక్టర్ గౌతమ్ స్క్రిప్టుకి మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఎలాగో ఖుషీ సినిమా పూర్తవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఆలోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయడానికి వీలుంటుంది.

ఇకపోతే.. గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్‌తో పాటు రామ్ చరణ్‌తోనూ ఒక సినిమా చేయబోతున్నాడు. శంకర్‌తో చేస్తున్న సినిమా ముగిసిన వెంటనే, ఆ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దాన్ని రూపొందించబోతున్నాడు. అటు, విజయ్‌తో చేయబోయే చిత్రాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కించబోతున్నారని సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dil Raju
  • Gautam Tinnanuri
  • Vijay Deverakonda
  • Vijay Gautam Tinnanuri Project
  • Vijay Samantha Khushi

తాజావార్తలు

  • Chanakya Niti: మీ శత్రువుపై విజయం సాధించడం ఇక చిటికెలో పని! ప్రపంచాన్ని శాసించిన చాణక్యుడి మాస్టర్ ప్లాన్ ఇదే..

  • Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన

  • Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..

  • Couple: 29 ఏళ్ల మహిళ.. 36 ఏళ్ల ప్రియుడిని హోటల్‌కు పిలిచి.. గదిలో ఇలా..

  • AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions