Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా దిల్ రాజు పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు సంక్రాంతికి తన సినిమా వారసుడు ను రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకానొక సమయంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఉండడకూడదని రూల్ పెట్టిన ఆయనే ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమాఎం కోసం ఎక్కువ థియేటర్లు కావాలని అడిగి నిర్మాతలకు ఆగ్రహం తెప్పించాడు. ఇక మరోపక్క అజిత్ కన్నా విజయ్ నెంబర్ 1 అని చెప్పి కోలీవుడ్ లో హీట్ పెంచాడు. ఏది ఏమైనా.. ఎవరు ఎన్ని అనుకున్నా తాను ప్రేక్షకులను ఆనందాన్ని ఇచ్చే సినిమా ఏ భాషలో ఉన్నా తీసుకొచ్చి అభిమానుల ముందు ఉంచుతానని ప్రామిస్ చేసి.. అనుకున్నట్లుగానే వారసుడును సంక్రాంతి వారిలో దింపేశాడు. ఇక హీరో కూడా అన్ని ప్రమోషన్స్ చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి దిల్ రాజు మాత్రం తెగ కష్టపడుతున్నాడు.
ఇక తాజాగా దిల్ రాజా ఒక ఇంటర్వ్యూ లో సినిమా విషయాలతో పాటు ఆయన జీవితంలో జరిగిన కష్టనష్టాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి వలన తాను చాలా నష్టపోయానని చెప్పుకొచ్చాడు. ” పవన్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి నైజమ్ రైట్స్ తీసుకున్నాను.. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అంటే ఇదే అని చెప్పాలి. చాలా నష్టపోయాను. దాంతో పాటు మహేష్ స్పైడర్ కూడా ఆడలేదు. ఒకేసారి రెండు బిగ్గెస్ట్ ప్లాప్స్ పడినా కూడా నిలబడ్డాను.. అదే నా ప్లేస్ లో మరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకొనేవారు లేదా సినిమాలు నాకొద్దు బాబోయ్ అని పారిపోయేవారు. కానీ, నేను నిలబడ్డాను. అదే ఏడాది నిర్మాతగా 6 హిట్లు కొట్టి ఇక్కడ వరకు వచ్చాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.