Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తుంది దిల్ రాజునే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి మరో హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చరణ్.. రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లీకైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం దిల్ రాజు భారీగా ఖర్చుపెడుతున్నాడు. శంకర్ వర్క్ ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. ఈ మధ్యనే ఈ సినిమా గురించిన ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఒక్క సాంగ్ కోసమే శంకర్ కొన్ని కోట్లు ఖర్చు చేశాడంటూ చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. దిల్ రాజు మాత్రం దేనికి వెనుకాడేది లేదని.. ఎంత అయినా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పాడట. దీంతో శంకర్.. సినిమాను తనకు నచ్చినట్లు తీయడం ప్రారంభించాడు.
Kalki 2898AD: ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్.. చిరును ఇమిటేడ్ చేసిన ప్రభాస్
ఇక ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు.. చరణ్ బర్త్ డే కు మాత్రం టైటిల్ రివీల్ చేసి పోస్టర్ ను రిలిజ్ చేశారు అంతే.. దీంతో చిత్ర బృందం ఎవరు కనిపించినా.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ అభిమానులు రచ్చ చేయడం మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న దిల్ రాజు.. గాండీవధారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ అరవడం మొదలుపెట్టారు. ఇక దీనికి దిల్ రాజు ఇచ్చిన సమాధానం విని.. చరణ్ ఫ్యాన్స్ గుండె ముక్కలు అయిపోయిందని చెప్పాలి. “మన చేతిలో లేదు డైరెక్టర్ గారు ఇచ్చినప్పుడే డీటెయిల్స్ బయటకు వస్తాయ్.. మనమేం చేయలేం అమ్మా” అంటూ చేతులెత్తేశాడు. హార్ట్ కింగ్ చెప్పిన సమాధానానికి ఫ్యాన్స్ హార్ట్ పగిలిపోయింది. నిర్మాతే ఈ రేంజ్ గా చెప్తే.. డైరెక్టర్ ఎప్పుడు సినిమా ఫినిష్ చేసేది.. ఎప్పుడు అప్డేట్ వచ్చేది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి శంకర్ అంతకు ముందు సినిమాల్లానే.. ఇది కూడా ఆలస్యం అవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.