“ఆర్ఆర్ఆర్” మార్చి 18 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. మరి అదే తేదీల్లో విడుదలకు సిద్ధమైన ఇతర సినిమాల పరిస్థితి ఏంటి ? సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం “ఆర్ఆర్ఆర్” టీం గట్టిగానే పోరాటం చేసింది. తగ్గనే తగ్గను అంటున్న “భీమ్లా నాయక్” నిర్మాతను ఎలాగోలా నిర్మాతలు అంతా కలిసి ఒప్పించారు. మరి ఇప్పటి సినిమాల సంగతేంటి ? స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్ళీ త్యాగానికి రెడీ అంటున్నాడు.
Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!!
దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్”కి నో చెప్పలేను. నా సొంత సినిమా కోసం నేను లాక్ చేసిన తేదీకి ఆర్‌ఆర్‌ఆర్ వస్తుంటే, నేను నా డేట్‌ను త్యాగం చేస్తాను” అని అన్నారు. ‘ఎఫ్ 3’ విడుదల తేదీని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. “ఆర్ఆర్ఆర్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న థియేట్రికల్ విడుదల అవుతుందని ప్రకటించారు. సినిమా ఏప్రిల్ 28కి లాక్ చేయబడితే, అదే తేదీన రిలీజ్ కావాల్సిన ‘ఎఫ్ 3’ మూవీ వాయిదా పడుతుంది. మేము త్యాగం చేయడానికి, వేరే డేట్ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము” అని దిల్ రాజు అన్నారు. “ఆర్ఆర్ఆర్ అనేది పాన్-ఇండియా చిత్రం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి మార్గం చూపడం మా బాధ్యత. మేము అన్ని వేసవి విడుదలలను స్నేహపూర్వకంగా ప్లాన్ చేస్తాము” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఇతర సినిమాల విడుదలకు సంబంధించి నిర్మాతలందరూ కూర్చుని అదే చర్చిస్తారని, దాని ప్రకారం వారి తేదీలను ఖరారు చేస్తారని ఆయన చెప్పారు. మరి దిల్ రాజు అయితే చెప్పారు… కానీ ఇతర చిత్రాల నిర్మాతలు దీనికి రెడీగా ఉన్నారా ?