Dil Raju: తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక అయిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో పోటీపడిన దిల్ రాజు ప్యానెల్.. భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొట్టమొదటిసారి పోటీచేసి.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా గెలిచి ఔరా అనిపించాడు. ఇక కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇక ప్రెసిడెంట్ గా సంతకం చేసిన అనంతరం ఆయనకు ప్యానెల్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
Yadamma Raju: వేలు తీసేశారు.. ప్రాణం పోయినట్లనిపించింది
కాగా, ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. ఇక దిల్ రాజు రెండేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నాడు. మొదటి నుంచి కూడా దిల్ రాజు గెలుపును అందరు ఊహించారు. అందుకు కారణం చాలానే ఉన్నాయి. ఎప్పటినుంచో సి. కళ్యాణ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. ఈసారి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకొంటే.. ఆయన ఎలా పనిచేస్తాడో చూడాలి అని కొందరు అనుకోగా.. ఇంకొందరు.. టీఎఫ్‌సీసీని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పోటీ చేశాను అని దిల్ రాజు చెప్పడం చాలామందిని ఆకర్షించింది. అంతేకాకుండా చిన్న సినిమాలకు అండగా ఉంటాను అని ఆయన ఇచ్చిన హామీ..మిగతా నిర్మాతలకు వరంగా మారింది. ఇవన్నీ కలగలిపి దిల్ రాజును ప్రెసిడెంట్ గా చేసాయి. మరి..హార్ట్ కింగ్ ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.