Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ‘టాక్సిక్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లలో 476 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి, 63 చిత్రాలను నిర్మించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేతకు ఆయన అభినందనలు తెలిపారు. తమిళం, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో కేవీఎన్ సంస్థ సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. యశ్‌తో తన పరిచయం ‘కేజీఎఫ్’ సమయంలోనే ఏర్పడిందని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ కొత్త దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని అన్నారు. అయితే ముంబైలో ‘టాక్సిక్’ విజువల్స్ చూసిన తర్వాత యశ్ విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థమైందన్నారు.
‘‘కేజీఎఫ్ తర్వాత ఎవరైనా మరింత పెద్దగా ఆలోచిస్తారు. కానీ యశ్ తన కెరీర్‌ను పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మార్చే దిశగా వెళ్తున్నారు. ‘టాక్సిక్’ విషయంలో ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్’’ అని దిల్ రాజు కొనియాడారు. ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకోవడంపైనా దిల్ రాజు స్పందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ చెప్పిన నంబర్‌ను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అంగీకరించానని వెల్లడించారు. యశ్, కేవీఎన్ సంస్థల విజన్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇక ఈ సినిమా రూ.2,000 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా చెప్పిన విషయాన్ని కూడా దిల్ రాజు ప్రస్తావించారు. ‘‘విశాల్‌ను కలిసినప్పుడు ‘టాక్సిక్’ రూ.2,000 కోట్ల సినిమా.. ఇండియాలో రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నాడు’’ అని తెలిపారు. అదే సమయంలో యశ్‌తో నేరుగా తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్నకు కూడా దిల్ రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. యశ్‌తో సినిమా చేయడం కన్ఫర్మ్ అయిందని, అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందో తనకు కూడా తెలియదన్నారు. సరైన కథ దొరికినప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేస్తామని యశ్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక ‘టాక్సిక్’ కోసం పనిచేస్తున్న యశ్, గీతు మోహన్‌దాస్, కేవీఎన్ ప్రొడక్షన్స్, కియారా అద్వానీతో పాటు మొత్తం చిత్రబృందానికి దిల్ రాజు ఆల్ ది బెస్ట్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ‘టాక్సిక్’కు భారీ సౌండ్ వెళ్లాలని అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచాయి.
Also Read
- Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
- Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
- Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
- I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
తాజావార్తలు
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!