I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Am Game: దుల్కర్ సల్మాన్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్ సాంగ్’ విడుదలైంది. ఇప్పటికే సినిమాపై బజ్ పెరుగుతున్న వేళ, ఈ పాటతో దుల్కర్ స్వయంగా గాయకుడిగా మారడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉల్లాసమైన బీట్, ఎనర్జిటిక్ ట్యూన్‌తో సాగుతున్న ఈ పాట దుల్కర్ పాత్రలోని అటిట్యూడ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ‘లూజర్ సాంగ్’కు జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. మలయాళ వెర్షన్‌ను దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించగా, సుహైల్ కోయా సాహిత్యం అందించారు. ఈ సాంగ్ ఎనర్జిటిక్ గా ఉండటంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. భాష మారినా పాటలోని ఫీల్ మాత్రం అలాగే ఉంటుందని దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా ఓ మెసేజ్ కూడా ఇచ్చారు.
‘ఐ యామ్ గేమ్’ (I’m Game)లో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే అత్యంత స్టైలిష్, డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒక గ్యాంబ్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, బుక్మేకర్లు, అండర్‌వరల్డ్ బెట్టింగ్ మాఫియాతో తలపడుతూ, ప్రాణాలను పణంగా పెట్టి సాగించే ఒక ప్రమాదకరమైన సర్వైవల్ గేమ్‌లో ఆయన పాత్ర ప్రయాణం సాగుతుంది. చాలా కాలం తర్వాత ఇంత అల్లరి, చలాకీ ఉన్న పాత్రలో నటిస్తున్నానని దుల్కర్ గతంలో చెప్పడంతో డాన్ జాన్ పాత్రపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్‌తో పాటు కామెడీ, క్రైమ్, థ్రిల్ అంశాలను మేళవించిన ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
‘ఐ యామ్ గేమ్’లో దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోనీ వర్గీస్ పెపే, కయాదు లోహర్, కతిర్, మిస్కిన్, సంయుక్త, వినయ్ ఫోర్ట్, జయసుధ, శ్యామప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ సినిమాను 2026 ఆగస్టు 21న ఓనం సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల 2026సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ‘లూజర్ సాంగ్’ కూడా ఆ అంచనాలకు మరింత ఊపునిచ్చింది.
ఇక ‘ఐ యామ్ గేమ్’ తర్వాత దుల్కర్ సల్మాన్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’లో సాత్విక వీరవల్లి, శృతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు ‘శ్రీ శ్రీ’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రవి నెలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా చూస్తే.. ‘లూజర్ సాంగ్’తో ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్‌లో మరో ఆసక్తికరమైన అడుగు పడింది. దుల్కర్ సల్మాన్ నటనతో పాటు ఆయన గాత్రం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. మరి డాన్ జాన్‌గా దుల్కర్ థియేటర్లలో ఎలాంటి గేమ్ ఆడబోతున్నాడో తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!