8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- రెడ్మీ నోట్ 17 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్
- 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే
- భారీ 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 67W HyperCharge ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
- 50MP AI కెమెరా సిస్టమ్‌తో పాటు AI Creativity Assistant వంటి ఫీచర్లు
- Snapdragon 6s Gen 4 చిప్సెట్తో
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుంచి అధిక రక్షణ
- స్టీరియో స్పీకర్లు, Dolby Atmosతో పాటు 300% వరకు ఆడియో బూస్ట్ ఫీచర్
- Redmi Note 17 Pro 5G ప్రారంభ ధర $399 (రూ.38,095).
- శాటిన్ ఆరంజ్, స్కై బ్లూ, పర్పుల్, బ్లాక్ రంగుల్లో లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI Note 17 Pro 5G: రెడ్మీ (REDMI) కొత్తగా రెడ్మీ నోట్ 17 ప్రో 5G (REDMI Note 17 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ చిప్సెట్, బలమైన బాడీతో ఈ ఫోన్ తయారైంది. ముఖ్యంగా రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీమీడియా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు ఫీచర్లను ఇందులో అందించారు. మరి మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దామా..
AMOLED డిస్ప్లే..:
REDMI Note 17 Pro 5Gలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ గరిష్ఠంగా 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. దీంతో ఎండలోనూ స్క్రీన్‌పై కంటెంట్‌ను స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే డిస్ప్లేలో అత్యంత తక్కువగా 1 నిట్ బ్రైట్నెస్ను సెట్ చేసుకునే అవకాశం ఉంది. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు 3840Hz PWM డిమ్మింగ్ ను కూడా అందించారు. TÜV Rheinland నుంచి లో బ్లూ లైట్, సిర్కాడియన్ ఫ్రెండ్లీ, ఫ్లిక్ర్ ఫ్రీ వంటి సర్టిఫికేషన్లు కూడా ఈ డిస్ప్లేకు ఉన్నాయి.
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
భారీ బ్యాటరీ & AI కెమెరా:
ఈ కొత్త మొబైల్లో 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని వేగంగా ఛార్జ్ చేసేందుకు 67W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అలాగే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. కంపెనీ వివరాల ప్రకారం బ్యాటరీ హెల్త్‌ను దీర్ఘకాలం కొనసాగించేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. భారీ బ్యాటరీ కారణంగా తరచుగా ఛార్జర్‌ను ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్లో 50MP AI కెమెరా సిస్టమ్ ను అందించారు. ఇందులో లైవ్ మోమెంట్, AI క్రియేటివిటీ అసిస్టెంట్ వంటి సాఫ్ట్వేర్ ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫొటోలు, వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు AI ఆధారిత కెమెరా ప్రాసెసింగ్‌ను ఉపయోగించారు.
ప్రాసెసర్ & IP69K రేటింగ్:
పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ యాప్స్, మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. మెమరీ ఎక్స్టెన్షన్ టెక్నాలజీ ద్వారా ఫోన్లోని ర్యామ్ ను 24GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు 12GB ర్యామ్ వేరియంట్లో అదనంగా 12GB మెమరీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.
మరోవైపు మన్నికను దృష్టిలో పెట్టుకుని ఇందులో “రెడ్మీ టైటాన్ స్ట్రక్చర్ “ను ఉపయోగించారు. ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను అందించారు. మూడు మీటర్ల వరకు డ్రాప్ రెసిస్టెన్స్‌కు సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇంకా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ పరంగా IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌ను ఫోన్ పొందింది. 2 మీటర్ల లోతులో 72 గంటల వరకు వాటర్ రెసిస్టెన్స్‌ను అందించేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
300% వరకు ఆడియో బూస్ట్:
ఆడియో విషయంలోనూ ఈ ఫోన్ ప్రత్యేకతను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లను అందించారు. అవసరమైన సందర్భాల్లో వాల్యూమ్‌ను 300% వరకు బూస్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో వీడియోలు, సినిమాలు, మ్యూజిక్, గేమింగ్ సమయంలో మరింత బిగ్గరగా ఆడియోను వినవచ్చు. సాఫ్ట్వేర్ పరంగా ఇందులో గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లను అందించారు. వీటితో స్క్రీన్‌పై కనిపించే వస్తువులు, టెక్స్ట్ లేదా ఇతర అంశాల గురించి వేగంగా సమాచారం పొందవచ్చు. అలాగే Xiaomi HyperOS ఆధారిత సాఫ్ట్వేర్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది. AI ఆధారిత ఫీచర్లతో పాటు మెమరీ ఎక్స్టెన్షన్, కెమెరా ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి.
ధర:
REDMI Note 17 Pro 5G ప్రారంభ ధర USD 399 (రూ.38,095)గా ఉంది. ఈ ఫోన్ శాటిన్ ఆరంజ్, స్కై బ్లూ, పర్పుల్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
That is #REDMINote17Pro5G. Same Titan DNA as Pro Max.
Same lasting quality and flagship-level experiences, but with a distinct character all its own.#REDMINote17SeriesLaunch pic.twitter.com/NfHTqReotW
— Xiaomi (@Xiaomi) August 27, 2026
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..