Dil Raju Announced one more Movie with Vijay Deverakonda: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్ గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్ మీరు చూశారు మీ అందరికీ నచ్చింది, అందుకే మీలో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. పరశురామ్ ఈ కథ చెప్పగానే అందులో పాయింట్ నన్ను ఎగ్జైట్ చేసింది, స్టోరీని డెవలప్ చేశాక మేమంతా ఇంప్రెస్ అయ్యామని, విజయ్, పరశురామ్ కలిసి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చేశారు.
Mrunal Takur : స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మృణాల్.. ఫ్యాన్స్ ఫిదా…
ఈ సినిమా కూడా వాళ్ల కాంబినేషన్ లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది, ఫ్యామిలీ స్టార్ కు విజయ్ క్యారెక్టరైజేషన్ వెన్నెముక లాంటిది, విజయ్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెను ద్వేషిస్తాడు, రొమాన్స్ చేస్తాడని, ఇలా అన్ని షేడ్స్ హీరో క్యారెక్టర్ లో ఉన్నాయన్నారు. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పవచ్చు, ఇది కేవలం ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. 30 పర్సెంట్ ఫ్యామిలీ స్టోరీ, 70 పర్సెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. మృణాల్ లక్కీ హీరోయిన్. సీతారామం, హాయ్ నాన్న సక్సెస్ తర్వాత ఫ్యామిలీ స్టార్ తో ఆమె హ్యాట్రిక్ అందుకోబోతోంది, దర్శకుడు పరశురామ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు, ఇప్పుడు కూడా డబ్బింగ్, మిక్సింగ్ వర్క్స్ చేయిస్తున్నాడని అన్నారు.
మా సంస్థలో విజయ్ తో తను చేస్తున్న సినిమాను సక్సెస్ చేయాలనే తపన పరశురామ్ లో ఉంది, ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యింది. ఏప్రిల్ 5 నాకు ఎంతో స్పెషల్. ఆ రోజుతో దిల్ సినిమా రిలీజ్ తో నేను రాజు నుంచి దిల్ రాజు అయ్యా, అప్పటి నుంచి మొన్నటి బలగం సినిమా వరకు మీరూ, ప్రేక్షకులూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ఇకపైనా కొనసాగాలన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎనర్జిటిక్ గా పాటలు పాడుతున్నా, డ్యాన్సులు చేస్తున్నా. అంతేగానీ స్క్రీన్ మీద నటించే ఆలోచన లేదు, విజయ్ హీరోగా మా సంస్థలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ఉంటుందని, దానికి స్క్రిప్ట్ రెడీ అయ్యిందని పేర్కొన్న ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు టైమ్ పట్టేలా ఉంది. అదంతా పూర్తయ్యాక ఆ మూవీ తప్పకుండా సెట్స్ మీదకు తీసుకెళ్తామన్నారు. విజయ్ ప్రొడ్సూసర్స్ గురించి ఆలోచించే హీరో, అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నానని అన్నారు.