నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం తారకరత్న అంత్యక్రియలని దగ్గరుండి చూసుకుంటున్న మాదాల రవి, తారక రత్నతో తనకి ఉన్న స్నేహబంధం గురించి మాట్లాడుతూ… “తారకరత్న చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇండస్ట్రీ వాళ్లకి, అభిమానులకి అతని పేరు తారక రత్న ఏమో కానీ నిజానికి అతని పేరు ఓబులేసు. మేము ఓబు, ఓబు అని పిలిచే వాళ్లం. నేనూ డాక్టర్ నే కానీ తారక రత్న హార్ట్ ప్రాబ్లం ఉంది అని నాతో కూడా ఏ రోజు షేర్ చేసుకోలేదు” అని మాదాల రవి తెలిపారు.
Read Also: Taraka Ratna: అంత్యక్రియలకు ముహూర్తం పెట్టింది బాలయ్యే- మాదాల రవి