Sreeleela: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక హీరో బదులు ఇంకో హీరో.. ఒక హీరోయిన్ బదులు ఇంకొక హీరోయిన్ సెలక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్న కథకు హీరో, హీరోయిన్లు దొరికినా కొన్ని అనివార్య కారణాల వలన వారి ప్లేస్ లో మరొకరిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక అలా హీరోయిన్లు మారినా హిట్ పడితే వారి దశ తిరిగినట్టే. సీతారామం సినిమాలో మృణాల్ కన్నా ముందు పూజా హెగ్డేను అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వలన ఆమె కాదు అనడంతో మృణాల్ ఠాకూర్ తెలుగుకు పరిచయమైంది. ఇక ఈ సినిమాతోనే అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే.. ముద్దుగుమ్మ శ్రీలీల కూడా ఒక మంచి హిట్ సినిమాను మిస్ చేసుకుందట. అదే ఛలో. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగుతెరకు పరిచయమైంది. ఇక ఛలో సినిమా.. రష్మికను స్టార్ హీరోయిన్ గా చేసింది. అయితే రష్మిక కన్నా ముందు ఛలో సినిమాకు శ్రీలీలను అనుకున్నారట. ఈ విషయాన్ని నాగశౌర్య రంగబలి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.
Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
“ముందు ఛలో సినిమాకు శ్రీలీల ను హీరోయిన్ గా అనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వలన ఆమె వద్దు అనడంతో రష్మికను తీసుకున్నాం” అని శౌర్య చెప్పాడు. దీంతో ఛలో లాంటి హిట్ ను శ్రీలీల మిస్ చేసుకుంది. ఒకవేళ ఈ సినిమా కనుక శ్రీలీల చేసి ఉంటే.. అమ్మడు వచ్చి ఇప్పటికి ఐదేళ్లు అయిపోయేది. ఆ హిట్ తో మరిన్ని హిట్స్ ను అందుకొనేది. అయితే ఆ ప్లేస్ లో రష్మిక రాకపోయి ఉంటే .. ఈ చిన్నది ఏ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. లేట్ అయినా శ్రీలీల తన స్వాగ్ ను మాత్రం ఆపడం లేదు. వరుసగా అరడజను కన్నా ఎక్కువ సినిమాల్లో కనిపించి షేక్ చేస్తోంది. ఈ రెండేళ్లు పాప తప్ప మరెవ్వరు కనిపించేలా లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి సినిమాలు ఒప్పుకోవడం వరకు ఓకే. హిట్స్ ఎన్ని అందుకుంటుందో చూడాలి.