Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తారని.. శని, ఆదివారాల్లో అస్సలు వర్క్ చేయరంటూ చురకలు అంటించింది. వాళ్ల గురించి కాకుండా తన గురించే వార్తలు రావడం కరెక్ట్ కాదంటూ తెలిపింది. అయితే ఆమె ఏ హీరో పేరు తీసుకోలేదు.
Read Also : Rashmika – Vijay Deverakonda : రష్మిక, విజయ్ ఏంటిది.. పెళ్లి విషయంలోనూ ఎందుకింత సస్పెన్స్..
అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మీద అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ ఒకే షోలో పాల్గొన్నప్పుడు.. అక్షయ్ కుమార్ రోజులో 8గంటలే పనిచేస్తాడని.. అంతకు మించి ఒక్క నిముషం కూడా సెట్ లో ఉండకుండా మేకప్ తీసేసి వెళ్లిపోతాడని అభిషేక్ తెలిపాడు. మరుసటి రోజు షూటింగ్ ఎర్లీమార్నింగ్ ఉన్నా సరే వచ్చేస్తాడని.. వర్క్ పట్ల అంత డెడికేషన్ గా ఉంటాడని అభిషేక్ అన్నాడు. దీంతో దీపిక చెప్పిన స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడా అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీపిక వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది.
Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు..
