Dia Mirza: ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ లో వీడియో లీక్ అయ్యి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరు సెలబ్రిటీలు కాబట్టి అందరికి తెలిసాయి.. సాధారణ ప్రజల పరిస్థితి మరి ఘోరమని చెప్పాలి. హోటల్ రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలను పెట్టి వారి పర్సనల్ వీడియోలను వారికే పంపి డబ్బులు గుంజుతున్నారు. ఇక ఈ వీడియోలపై నటి దియా మీర్జా స్పందించింది.
తెలుగులో వైల్డ్ డాగ్ సినిమాలో నాగ్ సరసన నటించి మెప్పించిన ఈ భామ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీక్ అవ్వడం చూసి భయపడ్డాను అని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఏ హోటల్ కు వెళ్లినా చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చింది. “ఒక దశాబ్దం క్రితం నటీమణులు స్నానం చేస్తున్న వీడియోలు నెట్ లో కనిపించడంతో నేను వణికిపోయాను. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా.. నేను వచ్చాకే హోటల్ రూమ్ ఓపెన్ చేయాలనీ, హోటల్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని చేసి, రహస్య కెమెరాలు ఉన్నాయా..లేదా..? అని వెతుకుతానని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.