కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు డైరెక్ట్ తెలుగు మూవీకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని కాకుండా అన్ని భాషల్లోనూ కనిపించడానికి భారీ స్కెచ్ వేశారు ధనుష్. ఈసారి పాన్ ఇండియా మూవీనే చేయబోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ధనుష్ నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది.
Read Also : Sarkaru Vaari Paata : మహేష్ కు మరోసారి మార్వెల్ ముప్పు
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు “కెప్టెన్ మిల్లర్” అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ఈ ప్రాజెక్ట్ 1930ల కాలం నేపథ్యంలో తెరకెక్కనున్న యాక్షన్-అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. మరోవైపు ధనుష్ ఖాతాలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. జో అండ్ ఆంథోనీ రస్సో దర్శకత్వం వహించిన హాలీవుడ్ ప్రాజెక్ట్ “ది గ్రే మ్యాన్”, సెల్వరాఘవన్‌తో కలిసి చేస్తున్న “నాన్ వరువేన్” విడుదలకు సిద్ధమవుతున్నాయి.