Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు అందరి దృష్టి శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు ‘ఇరుముడి’ కంటే ముందే మొదలైనట్లు తెలుస్తోంది. ధనుష్‌తో శివ నిర్వాణ ఇప్పటికే కథా చర్చలు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ధనుష్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో శివ ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ధనుష్, శివ నిర్వాణ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది. ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు పెరిగే అవకాశముంది. మరోవైపు ‘ఇరుముడి’ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించే సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్‌గా మారనుందని చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!