Dhanush: మాస్టారు.. మాస్టారు.. మా మనసును గెలిచారు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ధనుష్ గురించి ఇదే అనుకుంటున్నారు. మొదటి నుంచి ధనుష్ కు తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులో కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతోంది. రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గర అయ్యాడు. ఇక ఇప్పుడు సార్ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ధనుష్ పాల్గొన్నాడు. తెలుగులో మాట్లాడాడు.. తెలుగు అభిమానుల ఆశీర్వాదాలు కావాలని కోరాడు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో కూడా రిలీజ్ అవుతోంది. తమిళ్ హీరో కదా.. అక్కడే ప్రమోషన్స్ చేసుకుంటాను అని అనకుండా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసిన స్టార్ హీరో.. ధనుష్.
Hyper Aadhi: ఢీ కావాలో.. పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకో అన్నాడు
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమా ఎలా ఉన్నా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. తమ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ మాత్రం తమ సినిమా కేవలం డబ్బింగ్ సినిమాగానే తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పుకు రావడం తెలుగు అభిమానులకు కోపం తెప్పించింది. ముఖ్యంగా విజయ్.. వారసుడు విషయంలో ఇదే విధంగా బిహేవ్ చేశాడు. వరిసు బై లింగువల్ కాదని కేవలం తమిళ్ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ మాత్రమే అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక అజిత్ సంగతి సరేసరి.. తెలుగు కాదు కదా తమిళ్ లో కూడా ప్రమోషన్స్ చేయలేదు. కనీసం ఇద్దరు ఒక వీడియో బైట్ కూడా ఇచ్చింది లేదు. వీరిలానే ధనుష్ కూడా ప్రమోషన్స్ కు రాడని, తెలుగువారితో మాట్లాడడని చెప్పుకొచ్చారు. అయితే ఆ అంచలనాలను తారుమారు చేస్తూ ధనుష్ తెలుగువారితో ఇంటరాక్ట్ అయినా విధానం ఆకట్టుకొంటుంది. తెలుగు రాదు.. కొద్దిగా అడ్జెస్ట్ చేసుకోండి అని చెప్పడం, అభిమానులు అడగగానే సాంగ్ పాడడం, అన్ని ప్రమోషన్స్ కు, ఇంటర్వ్యూలకు వస్తానని చెప్పడంతో తెలుగు అభిమానులకు ధనుష్ విపరీతంగా నచ్చేశాడు. ఆ స్టార్స్ తో పోల్చుకుంటే ధనుష్ వెయ్యి రేట్లు బెటర్..అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరి ఫిబ్రవరి 17 న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.