Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూసుకుని ఎమోషనల్ అయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసుకుని కొంచెం ఎమోషన్ అయినట్టు కనిపిస్తున్నారు.
read also : Shekar Kammula : శేఖర్ కమ్ముల మూవీలు.. సోషల్ మెసేజ్ లు..!
పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ.. ఫస్ట్ షో నుంచే అన్ని ఏరియాల్లో మంచి టాక్ సంపాదించుకుంది. ధనుష్ లాంటి స్టార్ హీరో ఒక బిచ్చగాడిగా కనిపించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పైగా బిచ్చగాడి గెటప్ లో ఆయన ఒదిగిపోయిన తీరు ప్రశంసలు కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నాగార్జునకు సరైన పాత్ర పడింది.
శేఖర్ కమ్ముల నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి. ఇందులో ఎవరు హీరో అంటే చెప్పలేమని.. కథే హీరో అని చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాట. తెలుగుతో పాటు తమిళంలో మంచి రివ్యూలు వస్తుండటంతో మూవీ టీమ్ సంతోషంగా ఉంది. ధనుష్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఇప్పుడు ఈ పాత్రతో మరో మైల్ స్టోన్ అందుకున్నాడనే చెప్పాలి.
read also : Kubera : కుడి ఎడమైందే..!