ధనుష్… ప్రెజెంట్ జనరేషన్ హీరోల్లో పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న ఏకైక స్టార్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్స్ లో సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇతర హీరోలు ఒకే సినిమాని పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి చాలవన్నట్లు దర్శకత్వం కూడా చేస్తున్న ధనుష్… ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమాని వాళ్లు… ధనుష్ లిస్టులో మూడో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ రాబోతుంది రాసిపెట్టుకోండి అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే మాట వినిపిస్తున్న సమయంలో కెప్టెన్ మిల్లర్ సినిమాని చూడడానికి కోలీవుడ్ సినీ అభిమానులు థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు.
పండగ సీజన్ ని క్యాష్ చేసుకుంటూ కెప్టెన్ మిల్లర్ సినిమా మొదటి వారంలో 90 కోట్ల మార్క్ ని చేరుకుంది. ఫెస్టివల్ సీజన్ కంప్లీట్ అయిపోయి సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కెప్టెన్ మిల్లర్ సినిమా కలెక్షన్స్ మళ్లీ పుంజుకోనున్నాయి. మండే వరకూ మంచి హోల్డ్ ని మైంటైన్ చేస్తే చాలు కెప్టెన్ మిల్లర్ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం గ్యారెంటీ. సంక్రాంతికే తెలుగులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగులో ఎక్కువ చిత్రాలు రిలీజ్ కి ఉండడంతో జనవరి 14న రిలీజ్ కానుండా జనవరి 25కి వాయిదా పడింది. ఈ సినిమాని తెలుగులో జనవరి 25న రిలీజ్ చేయబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి కెప్టెన్ మిల్లర్ సినిమాని రిలీజ్ చేయబోతున్నాయి.