కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తున్న ధనుష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న’కెప్టైన్ మిల్లర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ధనుష్ అందుకు తగ్గట్లుగానే కెప్టెన్ మిల్లర్ సినిమాలో అద్భుతంగా నటించాడట. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని కెప్టెన్ మిల్లర్ సినిమాలో చూడబోతున్నామని ఇసైడ్ టాక్. రైటర్, డైరెక్టర్ లో సత్తా ఉండాలి కానీ ఎలాంటి సీన్ ఇచ్చినా పెర్ఫార్మెన్స్ చెయ్యగల ధనుష్, కెప్టెన్ మిల్లర్ సినిమాతో జైలర్, విక్రమ్ రేంజ్ హిట్ కొడతాడని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. ఫస్ట్ సాంగ్ ని రెడీ అవుతున్న కెప్టెన్ మిల్లర్ సినిమా గురించి లేటెస్ట్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చి ధనుష్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కెప్టెన్ మిల్లర్ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని లైకా ప్రొడక్షన్ హౌజ్ సొంతం చేసుకుంది. భారీ బడ్జట్ సినిమాలని, స్టార్ హీరోస్ తో సినిమాలని ప్రొడ్యూస్ చేసే లైకా ప్రొడక్షన్ హౌజ్ ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2 సినిమాలతో చూసాం. ఓవర్సీస్ లో పొన్నియిన్ సెల్వన్ సినిమాని లైకా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసింది, ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ విషయంలో కూడా ఆ రేంజ్ ప్రమోషన్స్ జరిగితే ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడినట్లే.
Happy to announce @LycaProductions as our Overseas distributor for #CaptainMiller 💥🥁
GRAND WORLDWIDE RELEASE ON DECEMBER 15th, 2023 @dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @saregamasouth pic.twitter.com/IT9gPeg6is
— Sathya Jyothi Films (@SathyaJyothi) September 26, 2023