Devil Movie getting ready for Release on 29th Deceber: 2023 ఏడాది పూర్తి కావస్తోంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌ను క్రియేట్ చేయగా ఇప్పుడు అలాంటి అంచనాలతో ‘డెవిల్’ రానుండటం అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది గ్రాండ్ గా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు అమేజింగ్ రెస్పాన్స్ రాగా ట్రైలర్ 12 మిలియన్ వ్యూస్‌ను దాటి దూసుకెళ్తోంది.
Curry And Cyanide : ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇక ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌లో చూడని సరికొత్త డైమన్షన్‌ను డెవిల్ చిత్రంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా ఆవిష్కరిస్తుండటం కొసమెరుపు. బ్రిటిష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారు అనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు, ఇలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది, 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఇక ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీ పడలేదని స్పష్టమవుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటిని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లేలా హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం ఉంది. డెవిల్ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు.