Curry And Cyanide : ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొంతమంది మూవీ లవర్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమా గా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ మరియు సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు.ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ డాక్యుమెంటరీ వచ్చింది. అదే “కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్”. కేరళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన జూలీ జోసేఫ్ 14 సంవత్సరాల్లో మొత్తం 6 హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను హత్య చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
ముఖ్యంగా ఆమె ఆరు హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసిందో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.. ఈ రియల్ క్రైమ్ కథను ఆధారంగా తీసుకునే అనేక సినిమాలు రాగా తాజాగా “కర్రీ అండ్ సైనైడ్ ది జూలీ జోసేఫ్ కేస్” పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కర్రీ అండ్ సైనైడ్ డిసెంబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ మరియు ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.జూలీ జోసేఫ్ తన కుటుంబ సభ్యులనే సైనైడ్ పెట్టి చంపేస్తుంది. ఆమె వారికి సైనైడ్ ఎలా ఇచ్చింది, ఆ హత్యలను ఏవిధంగా కవర్ చేసింది. చివరకు ఆమె పోలీసులకు ఎలా చిక్కింది వంటి అనేక ఆసక్తిర అంశాలతో కర్రీ అండ్ సైనైడ్ తెరకెక్కింది. ఇదిలా ఉంటే 2019లో జూలీతో పాటు ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన మరో ఇద్దరు నిందితులు ఎమ్ ఎస్ మాథ్యూ మరియు ప్రాజీ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!