Ranveer Singh : సైమాలో రణవీర్ తో దేవరకొండ చిందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఆ తర్వాత వచ్చిన ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ హిట్ కావటంతో టాప్ స్టార్ గా ఎదిగాడు విజయ్. స్టార్ డమ్ తో పాటు బడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా సక్సెస్ మాత్రం దరి చేరటం లేదు. ఇటీవల పూరితో కలసి చేసిన ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో కెరీర్ పై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే జయాపజయాలు దైవాధీనాలుగా భావించే విజయ్ బిహేవియర్ లో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఇటీవల జరిగిన సైమా ఈవెంట్ లో విలేకరులు ‘లైగర్’ పరాజయం గురించి ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా వచ్చింది సైమా వేడుకలకు అంటూ డైవర్ట్ చేశాడు.
ఈ ఈవెంట్ లోనే బాలీవుడ్ స్టార్ రణవీర్ తో కలసి చిందేశాడు విజయ్. ఈ ఇద్దరూ అద్భుతమైన ఆఫ్-స్క్రీన్ ప్రెజన్స్ ఉన్నవాళ్ళే. అందుకేనేమో వీరిద్దరికీ దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆదివారం రణవీర్ సోషల్ మీడియాలో విజయ్ తో కలసి డాన్స్ చేసిన ఫోటో షేర్ చేశాడు. ఇందులో రణవీర్ తెలుపు రంగు దుస్తులలో కనిపించగా, విజయ్ మాత్రం నలుపు రంగు దుస్తులలో డోంట్ కేర్ అన్నట్లున్నాడు. ఈ ఫోటోకు రణ్ వీర్ ‘రౌడీ బాయ్స్’ అనే క్యాప్షన్ పెట్టాడు. రణ్ వీర్ షేర్ చేసిన ఈ ఫోటో చూసిన తర్వాత ఈ హీరోల అభిమానులు వారి నృత్య ప్రదర్శనను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతతో ఉన్నారు. మరి సైమా ఈవెంట్ టెలికాస్ట్ ఏ ఛానెల్ లో ప్రసారం చేస్తుందో చూడాలి.
Also Read
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!