Devara: ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని మాస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరటాల శివ అనగానే తెలుగు కమర్షియల్ సినిమాకి మెసేజ్ రంగుని అద్దిన ఒక కొత్త రకం దర్శకుడు కనిపిస్తాడు. మాస్ అంటే అలా ఇలా కాదు కొరటాల మాస్ ఇంకో రకం. హీరో ఎక్కువగా మాట్లాడాడు, చాలా సెటిల్డ్ గా ఉంటాడు. సోషల్ కాజ్ లేకుండా ఫైట్ చేయడు, రొట్ట కొట్టుడు కూడా ఉండదు. జనాలకి మంచి చేయాలనుకునే హీరో… ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్య… ఈ రెండింటి మధ్యే కొరటాల శివ సినిమా ఉంటుంది. ఎలివేషన్స్ ఇచ్చినా, లో యాంగిల్ షాట్ పెట్టినా, విజిల్ వేయించే రేంజ్ డైలాగ్ పెట్టినా అది కథలో భాగంగా మాత్రమే ఉండేలా చూసుకోవడం కొరటాల శివ స్టైల్. ‘శివ’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఇండియన్ సినిమాని కొత్త దారిలోకి నడిపించాడు. అందుకే ఇండియన్ సినిమా అనగానే వర్మకి ముందు వర్మకి తర్వాత అంటారు.
కొరటాల కూడా అంతే కమర్షియల్ సినిమాల్లో సోషల్ కాజ్ తీసుకోని రావొచ్చు, హీరో కాజ్ కోసం ఫైట్ చెయ్యొచ్చు అని నిరూపించాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి అలాంటి సినిమాలే చేస్తూ వచ్చిన కొరటాల శివ అపజయమే లేకుండా ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. ఆచార్య సినిమా కారణంగా కెరీర్ పై మచ్చ పడే వరకూ తెచ్చుకున్న కొరటాల శివ, ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పేసాడు. ఈ సినిమాలో సముద్ర వీరుడిగా కనిపించనున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కొరటాల శివ ఏ రేంజులో డిజైన్ చేసాడో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అనగానే కొరటాల స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అలాంటిది ఆచార్య తర్వాత సినిమా అంటే కొరటాల, ఎన్టీఆర్ కోసమే కాదు తన కోసం కూడా పని చేస్తాడు. ఈ ఇద్దరూ కలిసి ఏప్రిల్ 5న ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని మాస్ ని చూపిస్తారేమో చూడాలి.
Also Read
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!