Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అప్డేట్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫౌజీ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పరిచయం చేస్తూ.. ప్రభాస్ పాత్రను చూపించారు. బ్రిటిష్ వారిని ఎదుర్కొనే వీర సైనికుడిగా ప్రభాస్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్ అనే ఎలివేషన్, భారీ రైఫిల్‌తో ప్రభాస్ కనిపించే సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి.
Also Read
- Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
- SS Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే 5-6 రెట్లు ఎక్కువ.. 'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. 'వారణాసి' తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ఇక ఫౌజీలో ప్రభాస్ ఒక స్పైగా కనిపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించినట్లు ఈ వీడియోలోని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్ సుమారు 15 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ఈ సీక్వెన్స్ సాధారణ స్థాయిలో కాకుండా.. భారీగా తెరకెక్కించినట్లు, దాని అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సినిమాలో మ్యాడ్ సీక్వెన్స్ అట.
ఫౌజీలో ప్రభాస్, ఇమాన్వితో పాటు సుబోధ్ భవే, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన, ప్రభాస్ స్పై పాత్ర, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఫౌజీపై ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
-
Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
-
Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
-
అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!