Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Is Subodh Bhave: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ వంటి ప్రముఖులకు సంబంధించిన విజువల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ విజువల్స్ చూసిన చాలామంది వాటిని ఏఐతో రూపొందించినవిగా భావించారు. అయితే ఇందులోని కీలక పాత్రలను నిజమైన నటులే పోషించడం విశేషం.
ఫౌజీ గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరా? అని వెతుకుతున్నారు. ఎందుకంటే.. గ్లింప్స్‌లో నేతాజీ పాత్రకు ఆయన రూపం, ఆహార్యం అచ్చుగుద్దినట్లు సరిపోయాయి. నేతాజీ పాత్ర చేసింది మరెవరో కాదు.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సుబోధ్ భవే. మరాఠీ సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించిన ఆయన.. టెలివిజన్, నాటక రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రభాస్ సినిమాలో చంద్రబోస్ పాత్రలో కనిపించడం తనకు ప్రత్యేకమైన అనుభవమని సుబోధ్ వెల్లడించారు. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, తన సన్నిహితులు గ్లింప్స్‌లో తనను చూసి ఆశ్చర్యపోయారని, అభినందనలు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
- Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
- Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
- SS Rajamouli: 'ఆర్ఆర్ఆర్' కంటే 5-6 రెట్లు ఎక్కువ.. 'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
సుబోధ్ భవే తన కెరీర్‌ను నాటక రంగం ద్వారా ప్రారంభించారు. 1990లో పలు నాటకాలలో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. నాటక రంగంలో సంపాదించిన గుర్తింపుతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2002 నుంచి మరాఠీ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంకణీ, మలయాళ సినిమాల్లోనూ ఆయన నటించారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా సుబోధ్ తన ప్రతిభను చాటుకున్నారు. కత్యర్ ఖల్జత్ గుసాలీ చిత్రంతో దర్శకుడిగా మారారు. విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
2015లో విడుదలైన ‘లోక్మాన్య: ఏక్ యుగపురుష్’ చిత్రంలో సుబోధ్ భవే స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. చారిత్రక వ్యక్తుల పాత్రలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన శైలిని చూపించిన సుబోధ్.. ఇప్పుడు ఫౌజీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. సుబోధ్ తన చిన్ననాటి స్నేహితురాలు మంజశ్రీ దేశ్ పాండేని 2001లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
తాజావార్తలు
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
-
Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
-
Jakkampudi Raja: వైసీపీ అభ్యర్థిపై దాడి కేసు.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!