Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ చుట్టూ ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా సుధీర్, దీపికా పిల్లి కలిసి నెదర్లాండ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఒక ఫోటో బయటకు రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై దీపికా పిల్లి స్పందించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సుధీర్, యాంకర్ దీపికా పిల్లి నెదర్లాండ్స్‌లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారంటూ గత రాత్రి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. దీపికా పిల్లి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనే ఈ ఫోటో కనిపించడంతో.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అభిమానులు రకరకాల కామెంట్లతో హోరెత్తించారు. కానీ, తెల్లారేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
Also Read:Balakrishna : అఖండ-2 రిజల్ట్‌తో రిస్క్ చేస్తున్న బాలయ్య!
Also Read
- Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
- Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
- Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
- I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
దీపికా పిల్లి ఒక ఎమోషనల్ అండ్ సీరియస్ పోస్ట్‌ను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని ఆమె అధికారికంగా ప్రకటించింది. “నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. నిన్న రాత్రి నా స్టోరీలో షేర్ చేసిన ఫోటో పూర్తిగా AI-Generated. అది పక్కా ఫేక్ పిక్. నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా ఆ ఫోటోను పోస్ట్ చేశారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని దీపికా తన ఫాలోవర్లను కోరింది. “దయచేసి ఆ ఫోటోను ఎక్కడా సర్క్యులేట్ చేయకండి. అలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దు. ప్రస్తుతం నా అకౌంట్‌ను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నాను. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు” అంటూ ఒక నోట్ విడుదల చేసింది. మొత్తానికి, సుధీర్ – దీపికా వెకేషన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా హ్యాకర్ల పని అని తేలిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నా, ఈ హ్యాకింగ్‌పై దీపికా పోలీసులకు ఫిర్యాదు చేస్తుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!