Purusha Hero: మా నాన్న కలే నన్నిలా హీరోను చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ (Purusha:). ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు. రాయంచ కొక్కుర హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించి తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన బ్యాక్‌గ్రౌండ్ గురించి చెబుతూ.. “మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లో ఉన్న కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మా నాన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మా నాన్నకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన ‘గోకులంలో సీత’ సినిమా చూసిన టైమ్‌కి నేను ఇంకా పుట్టలేదు. ఆ తర్వాత ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో నేను పుట్టడంతో.. నాకు ‘పవన్ కళ్యాణ్’ అని పేరు పెట్టారు. నన్ను హీరోగా చూడాలన్నది మా నాన్నగారి కల. నాకు కూడా సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇటు వైపుగా అడుగులు వేశాను” అని పవన్ తెలిపారు.
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
యాక్టింగ్‌లో తాను వైజాగ్‌లో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద నాలుగు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నానని పవన్ తెలిపారు. “డీఓపీ సతీష్ వల్లే ఈ కథ మా దగ్గరకు వచ్చింది. నా మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని ఈ ఫ్యామిలీ స్టోరీని ఎంచుకున్నాను. ఇది ఒకప్పుడు వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమా వైబ్‌లో ఉంటుంది. ఇందులో సప్తగిరి, కసిరెడ్డి నాకు ప్రతి విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. అలాగే, ఇంట్రోవర్ట్‌గా ఉండే నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చి దర్శకుడు వీరు అన్న బాగా యాక్ట్ చేయించారు. కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది” అని హీరో పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!