బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’ సిల్వర్ స్క్రీన్ పైనే మెరవనుంది. సెప్టెంబర్ 3న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, మేఘా ఆకాష్-శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం రేపు థియేటర్లోకి రానుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైన మేఘా ఆకాష్ చాలా ఆశలే పెట్టుకొంది.