DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC Release Date: దర్శకుడిగా వరుస విజయాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘డీసీ’ (DC) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లోకేష్, నటుడిగా ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో నెలకొంది. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విడుదల తేదీ ప్రకటనతో పాటు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి కనిపించిన లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
చిత్రబృందం ప్రకటించిన వివరాల ప్రకారం, ‘డీసీ’ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ కథ దేవదాస్, చంద్ర అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు పాత్రల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి చిత్రానికి ‘డీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కథలో ఈ ఇద్దరి మధ్య సాగే గ్యాంగ్ వార్ హైలెట్ గా నిలవనుంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుంన్నారు. దర్శకుడిగా ఇప్పటికే భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్, హీరోగా కూడా అదే స్థాయిలో మెప్పిస్తారా అనే ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. జూలై 31న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
- Tags
- cinema
- Lokesh Kanagaraj
తాజావార్తలు
-
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!