ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా “రౌడీ బాయ్స్”తో లాంచ్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుందట. హాట్ బజ్ ఏమిటంటే ఈ యూత్ డ్రామా మార్చి 4న ZEE5లో ప్రీమియర్ కానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Read Also : లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు… కానీ… !?
ఇక ముందుగా సినిమా థియేటర్‌లలో విడుదలైన 50 రోజులలోపు ఏ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోనూ సినిమాను విడుదల చేయబోమని దిల్ రాజు ప్రకటించారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో రన్ అవుతోంది. 2022 సంక్రాంతికి విడుదలైన ఈ కాలేజ్ డ్రామాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.