వచ్చే దసరాకు తెలుగు నుంచి రెండు, తమిళ్ నుంచి ఒకటి, కన్నడ నుంచి ఒకటి, హిందీ నుంచి ఓ ఫిల్మ్ థియేటర్లోకి రాబోతున్నాయి. హిందీ, కన్నడ నుంచి ఘోస్ట్, గణపథ్ సినిమాలు వస్తున్నప్పటికీ… లియో, టైగర్ నాగేశ్వర రావు, భగవంత్ కేసరి సినిమాలదే హవా కానుంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు తెలుగులో పోటీకి సై అంటున్నాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా తమిళ్ నుంచి విజయ్ లియో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 19న బాలయ్య-అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, విజయ్-లోకేష్ కనగరాజ్ ‘లియో’ రిలీజ్ అవుతుండగా.. 20న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వర రావు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం మేకర్స్ అంతా… ఈ సినిమాల ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఈ సినిమాలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. రన్ టైం కూడా లాక్ అయ్యింది. ఈ మూడు సినిమాల రన్ టైం ఓ సారి చూస్తే… టైగర్ నాగేశ్వరరావుకే ఎక్కువగా ఉంది. దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది కానీ భగవంత్ కేసరి మాత్రం రెండు గంటల 35 నిమిషాల రన్ టైంతో రానుందని తెలుస్తోంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివితో రానుందట. ఈ లెక్కన బాలయ్య సినిమానే తక్కువ మరియు పర్ఫెక్ట్ రన్ టైంతో థియేటర్లోకి రాబోతోంది. ఈ మూడు సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు అనే చెప్పాలి. మాస్ రాజా ఆడియెన్స్‌ను ఎక్కువసేపు థియేటర్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. లెంగ్తీ రన్ టైమ్ కాబట్టి… టైగర్ టాక్ పైనే సినిమా రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. లెంగ్త్ ఎక్కువ అయితే ఆడియన్స్ నుంచి ఫస్ట్ వచ్చే కామెంట్స్ రన్ టైమ్ పైనే ఉంటుంది.