Dhandoraa : ఈ మధ్య తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవన విధానం ఆధారంగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరబోతున్న మూవీ ‘దండోరా’. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ, డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవిశేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలజీ చేశాడు. ‘దండోరా’ టీజర్‌లో ఒక్క గ్రామంలో జరిగే వివిధ కథల్ని కలిపి చూపించారు. ఒక సర్పంచ్ చుట్టూ తిరిగే రాజకీయ డ్రామా, సమాజంలో పరువు కోసం పోరాడే ఒక వేశ్య జీవితం, అందమైన లవ్ స్టోరీ కనిపించాయి.
Read Also : Pawan Kalyan : సజ్జనార్ కు పవన్ అభినందనలు
గ్రామంలో ఒకరు చనిపోతారు. అతని చావు తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనే కోణంలో ఈ సినిమాను రూపొందించారు. కథకు ప్రధాన మూలం ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి. ఆ మరణం వెనుక ఉన్న నిజం ఏంటి.. దాని చుట్టూ గ్రామంలో ఏం జరుగుతుంది.. ఎవరి జీవితం ఎలా మారుతుంది ఈ ప్రశ్నలన్నింటినీ సినిమా ప్రధానంగా చూపించబోతుందని టీజర్ కనిపిస్తోంది. అప్పట్లో బలగం సినిమా కూడా చావు తర్వాత ఏం జరుగుతుందో చూపించింది. కానీ అది కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ దండోరా కూడా కామెడీతో పాటు కొంచెం సీరియస్ కోణంలో కనిపిస్తోంది.
Read Also : Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?