మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం నందమూరి బాలకృష్ణలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగో పిల్లర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఉన్న హిట్ పర్సెంటేజ్ ఏ హీరోకి ఉండదేమో. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషనల్, లవ్… ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసాడు వెంకటేష్. లేడీస్ లో వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. వెంకీ మామా సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫస్ట్ డే మార్నింగ్ షోకి కూడా లేడీ ఫ్యాన్స్ క్యూ కడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అంత గ్రిప్ లో మైంటైన్ చేస్తాడు వెంకటేష్. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి నటుడిగా అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు వెంకటేష్. మూడున్నర దశాబ్దాలుగా సీనియర్ స్టార్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న వెంకీ మామ పైన ఒక్క కాంట్రవర్సీ లేదు.
ఎలాంటి అనవసర విషయాల జోలికి పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోవడం వెంకటేష్ స్టైల్. యంగ్ హీరోస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోని తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ కి మళ్లీ ఊతమిచ్చాడు వెంకటేష్. అడ్వాన్స్డ్ గా ఆలోచించే వెంకటేష్ ఈరోజు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. దీంతో వెంకీ మామ ఫాన్స్ అండ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోస్ట్ హంబుల్ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే చేసిన వెంకటేష్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి దిగి చేస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమాతో వెంకీ ఎలాంటి హిట్ కొడతాడు అనేది చూడాలి.