నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read : Daaku Maharaaj : నేడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేసారు. అందుకోసం డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు, కానీ అందులో బాలయ్య డైలాగ్స్ లేవనే కంప్లైంట్ ఫాన్స్ నుండి వినిపించింది. దీంతో రాబోయే రిలీజ్ ట్రైలర్ ను బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేలా ట్రైలర్ గా కట్ చేసారని తెలుస్తోంది. ఫ్యాన్స్ నుండి ఇది కదా మాకు కావాల్సింది అనే రేంజ్ లో ఈ ట్రైలర్ రానుందట. ఈ రోజు సాయంత్రం డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.