స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిదని. మొదటి వారాంతంలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ సందడి నడుస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’పై అభిమానులు తమ అభిప్రాయాలను, రివ్యూలను పంచుకుంటుండగా, ఒక ఉల్లాసమైన మీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also : ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మీమ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… మీమ్ పైన అల్లు అర్జున్, క్రింద ఫహద్ ఫాసిల్ ఫోటోలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలకు ముందు అల్లు అర్జున్ బైక్ పై కూర్చొని అందరికీ హలో చెబుతున్నట్టుగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఆ ఫోటోను, సినిమాలో ఫహద్ ఫాసిల్ చెప్పే ‘పార్టీ లేదా పుష్ప ?’ అనే డైలాగ్ ను కలిపి మీమ్ ను రూపొందించారు. మీమ్ లో ఉన్న కామెంట్ “హెల్మెట్, మిర్రర్స్ లేవా పుష్ప?’ ఆకట్టుకుంటోంది. ఈ రోజుల్లో హెల్మెట్, సైడ్ మిర్రర్‌లు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించని వారి గురించి ఈ సందేశాన్ని ఉల్లాసంగా తెలియజేయడం అనేది సృజనాత్మక ఆలోచన. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రజలకు అవగాహన కల్పించడంలో సినిమాలను కూడా ట్రెండీగా ఉపయోగించుకుంటూ ఏమాత్రం ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్నారు.
Wear Helmet & Fix Rearview Mirrors. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad #Pushpa #PushpaRaj pic.twitter.com/USlupBLHIR
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) December 17, 2021
