కోలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి అందాల ఆరబోత ఎలా ఉంటుందో తెల్సిందే. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే.. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అక్కడ కూడా తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన బ్యూటీ హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని మంచి సెలబ్రిటీ హోదా సంపాదించుకొంది.
ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ కొత్త బెంజ్ కారును కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ మోడల్ కారు ధర అక్షరాలా కోటిన్నర వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోటోలను అమ్మడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. తన తండ్రితో కారు వద్ద నిలబడిన ఫోటోలను షేర్ చేస్తూ “నన్ను ఎప్పుడు పైకి ఎదగనిచ్చారు. కిందపడకుండా సపోర్ట్ నిచ్చారు. నేను ఎల్లప్పుడు ఈ విషయంలో అదృష్టవంతురాలినే.. ఎప్పటికి మీ లిటిల్ గర్ల్ నే” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.