Court Green signal to Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కప్పుడు స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో మాస్ మహారాజ కనపడబోతున్నాడని చెబుతున్నారు. రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడు వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వైరల్ అయి సినిమాపై భారీ అంచనాలు పెంచగా టైగర్ నాగేశ్వర రావు సినిమాకి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నట్టే కనిపించింది. ఎందుకంటే ఈ సినిమాపై స్టూవర్టుపురం ప్రజలతో కలిసి మరికొంతమంది కోర్టులో కేసు వేశారు.
Actor Naresh: పవన్ పేరు లాగుతూ పొలిటికల్ ఎంట్రీపై నరేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోర్టు కూడా టైగర్ నాగేశ్వర రావు టీంని హెచ్చరించగా తమ ఎరుకల జాతిని, తమ గ్రామాన్ని కించపరిచేవిధంగా సినిమా తీస్తున్నారని స్టువర్టుపురం ప్రజలు కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వర రావుని గజదొంగలా చూపిస్తూ, స్టువర్టుపురం గ్రామాన్ని నేర రాజధాని అన్నట్టు చూపిస్తున్నారని మమ్మల్ని కించపరుస్తున్నారని, సినిమాని ఆపాలని పలువురు నిరాహార దీక్షకు దిగారు. అయితే చివరి నిముషంలో అంటే సినిమా రిలీజ్ కి గంటల వ్యవధి ఉండగా ఈ సినిమాకి కోర్టులో గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమాకి సెన్సార్ కూడా పూర్తయిన క్రమంలో ఎవరినీ కించపరిచే సీన్లు, డైలాగులు ఉండవని భావిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్టు టైగర్ నాగేశ్వర రావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. తమకు ముందు నుంచి ఈ విషయం మీద నమ్మకం ఉందని ఆ నమ్మకం ఇప్పుడు నిజం అయిందని చెప్పుకొచ్చారు.