Box Office clash between Coolie and War 2: సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కానీ ‘హరిహర వీరమల్లు’తో మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వీరమల్లు వచ్చిన వారం తర్వాత ‘కింగ్డమ్’ థియేటర్లోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆగస్టులో భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆగష్టు ఫస్ట్ వీక్‌లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కూలీ, వార్ -2 పైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న కూలీ ప్రచార చిత్రాలు, పాటలు.. ఇప్పటికే అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఆగస్టు 2న విడుదలవుతున్న ట్రైలర్‌తో కూలీ సందడి మరింతగా నెలకొననుంది.
Also Read: The Raja Saab: ఓ వైపు వాయిదా, మరోవైపు పోరాటం.. మారుతి ఏం చేస్తారో!
ఇక హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న వార్-2 పై భారీ హైప్ ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను రూపొందిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. త్వరలోనే తెలుగులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైనల్‌గా ఆగష్టు నెల మొదలవడంతో.. బాక్సాఫీస్ వార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.