Tapsee Pannu:బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆమె ఒక ఫ్యాషన్ వీక్ లో వేసుకున్న ఆభరణం.. హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తాప్సీ ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ వీక్స్ లో కూడా పాల్గొంటూ ఉంటుంది. ర్యాంప్ వాక్ తో హొయలు పోతూ డిజైనర్ డ్రెస్ లకు, ఖరీదైన ఆభరణాలకు ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. ఇక గత వారం తాప్సీ.. లాక్మే ఫ్యాషన్ షో లో రెడ్ కలర్ డిజైనర్ డీప్ నెక్ లాంగ్ గౌన్ వేసుకొని రిలయెన్స్ జ్యూవెల్స్ ప్రత్యేకంగా తయారుచేసిన అందమైన లక్ష్మీ దేవి పొదిగిఉన్న ఆభరణాన్ని ధరించింది.
Dil Raju: అందుకే ‘శాకుంతలం ‘ నిర్మాణ బాధ్యతలు స్వీకరించా
డీప్ నెక్ కవర్ అయ్యేట్టు ఆ ఆభరణం ఆమె కంఠం మొత్తం ఇమిడిపోయింది. ఇక అందులో ఉన్న లక్ష్మీ దేవి విగ్రహం ఆ ఆభరణానికే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ హారం ధరించడంపై ఏకలవ్య గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్యాషన్ షోలో మతాన్ని కించపరిచే విధంగా తాప్సీ.. ఆ లక్ష్మీ దేవి హారాన్ని వేసుకుంది ఫిర్యాదులో తెలిపాడు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసుపై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం తాప్సీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఆమె ఒక తెలుగు సినిమా కూడా చేయనుందని టాక్.