NTV Telugu Site icon

Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య పోటీ.. గెలుపెవరిదో..?

Surya Vs Vikram

Surya Vs Vikram

బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ స్టైలే వేరు. కానీ ఈ మధ్య కాలంలో ఆయనలో ఫైర్ తగ్గింది. దర్శకుడిగా గత రెండు సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. నటనపై ఫోకస్ చేయడంతో మెగాఫోన్ పై పట్టుకోల్పోతున్నాడు. మునుపుటిలా మెప్పించలేకపోతున్నాడు. అలాగే ఎప్పుడో కంప్లీటైన ధ్రువ నక్షత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఇప్పుడు ధ్రువ నక్షత్రాన్ని మే 1న  సూర్యకు పోటీగా సినిమాను దింపుతున్నాడని చెన్నై వర్గాల టాక్.

Also Read : Nayan Sarika : స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేస్తున్న యంగ్ బ్యూటీ

సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో కూడా మే 1నే రిలీజ్ అవుతుంది. అదే రోజునే ధ్రువ నక్షత్రాన్ని తీసుకురావాలని, సూర్యపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు గౌతమ్ వాసుదేవ్. ఎందుకంటే  ఫస్ట్ ఈ ప్రాజెక్టుకు సూర్యనే ఫైనల్ చేశాడు గౌతమ్. సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటున్న టైంలో సడెన్లీ ఆ సినిమా నుండి స్టార్ హీరో తప్పుకోవడంతో హర్ట్ అయిన గౌతమ్ కొంత గ్యాప్ ఇచ్చి విక్రమ్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఏడాది క్రితమే షూటింగ్ కంప్లీటైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
రీసెంట్ ఇంటర్వ్యూల్లో కూడా సూర్య ప్రాజెక్ట్ నుండి క్విట్ కావడంపై బాధతో పాటు అసహనం వ్యక్తం చేశాడు గౌతమ్ వాసుదేమ్ మీనన్. ఇక సమ్మర్ లో సినిమాను తెస్తానని చెప్పిన ఈ స్టార్ డైరెక్టర్ సూర్యపై గౌతమ్ రివెంజ్ ప్లాన్  చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సూర్య, విక్రమ్ బాక్సాఫీస్ వార్ ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.