AHA: స్టార్ అండ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ షో వారం వారం ఎంటర్ టైన్ మెంట్ జోష్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఈ శుక్రవారం ఎపిసోడ్ లో ‘ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్’ను థీమ్ గా తీసుకుని, వినోదాల విందు వడ్డించే ప్రయత్నం చేశారు. పండగలు, పబ్బాలు అంటే ప్రతి ఇంటిలోనే కాదు… ప్రతి గల్లీలోనూ, ఊరిలోనూ ధూమ్ ధామ్ గా సందడి నెలకొంటుంది. ఆ హడావుడి అంతా ఈ వారం వేదిక మీద కనిపించింది. ఆరు టీమ్స్ చెలరేగిపోయి… ఎంటర్ టైన్ మెంట్ అందించే ప్రయత్నం చేశారు. మొదటి ఎపిసోడ్ అట్లుంటుంది మనతోనేని రౌండ్ లో ఏదైనా పార్టీ జరిగితే… జనాల రియాక్షన్ ఎలా ఉంటుందనే అంశాన్ని కమెడియన్స్ చేసి చూపించారు. బర్త్ డే పార్టీలను కొందరు ఇమిటేట్ చేస్తే, ఊరిలో జరిగే జాతరలలో జనం చేసే హంగామాను మరొకరు అనుకరించారు. ఇక న్యూ ఇయర్ పార్టీలను కొందరు ఇమిటేట్ చేస్తే, పండగ రోజుల్లో ముగ్గులు గీసి చేసే హడావుడిని మరికొందరు చూపించారు. ఈ ఎపిసోడ్ లో అందరికంటే ఎక్కువ మార్కులను అవినాశ్ కొట్టేసి మొదటి స్థానంలోనూ, రాజు రెండో స్థానంలోనూ నిలిచారు.
సెకండ్ రౌండ్ ‘పదా చూస్కుందాం’లో సినిమాల్లోని డైలాగ్స్ పై ఇద్దరిద్దరికి కాంపిటీషన్ పెట్టారు. ఆ రౌండ్ పూర్తయ్యేసరికీ రాజు టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. ఇక చివరి రౌండ్ ‘ఇచ్చిపడేద్దాం’లో ఏదైనా ఊరిలో జాతర సందర్భంగా కార్యక్రమం జరిగితే, దానికి హీరోహీరోయిన్లను పిలిస్తే ఎట్లాఉంటుందో కమెడియన్స్ అందరూ కలిసి పెర్ఫార్మ్ చేశారు. ఊరి పెద్దగా సద్దామ్ నటించగా, యాంకర్ గా సుధీర్, హీరోగా హరి, హీరోయిన్ గా దీపిక, మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవినాశ్ నటించారు. ఊరిలోని జనాలుగా వేణు, భాస్కర్, జ్ఞానేశ్వర్, రాజు నటించారు. అందరి కంటే ఈ ఎపిసోడ్ లో సూపర్ కామెడీని పండించి, రాజు లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డే గా నిలిచాడు. మొత్తం మీద సంక్రాంతి పండుగ రెండు వారాలు ఉండగానే… ‘ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్’తో ఆ వాతావరణాన్ని ముందే క్రియేట్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.