Site icon NTV Telugu

Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్‌ ఆర్థిక సాయం..

Ramchandram

Ramchandram

Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్‌ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు కిరణ్‌.

Read Also : Nagachaithanya : ఆమె సలహాలు పాటిస్తా.. నాగచైతన్య ఇలా అన్నాడేంటి

రామచంద్ర గత 20 రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయన కొన్ని నెలల పాటు ఇంటి వద్దే ఉండాలని డాక్టర్లు సూచించడంతో బెడ్ రెస్ట్ కే పరిమితం అయిపోయారు. దాంతో వైద్య ఖర్చుల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని.. తనకు సాయం చేయాలని ఆయన కోరారు. దీంతో వరుసగా టాలీవుడ్ నుంచి చాలా మంది వస్తూ ఆయనకు సాయం, భరోసా అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.

Read Also : Yamaha R15 సిరీస్‌కు కొత్త కలర్ ఆప్షన్లు.. ధరల వివరాలు ఇలా!

Exit mobile version