Comedian Ali: అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సోమవారం సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే, ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో విక్టరీ వెంటేశ్ మాట్లాడుతూ.. సినిమాకి వస్తోన్న ఆదరణపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎఫ్ 3 సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని వెంకీ తెలిపారు. మరో కథానాయకుడిగా నటించిన వరుణ్ సైతం సినిమా హిట్ అవ్వడంపై తన ఆనందాన్ని వ్యక్తిపరిచారు. ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తీశారని, థియేటర్‌లో పిల్లలు కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు.
Also Read
ఇక ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా తర్వాత అఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, భీమ్లానాయక్, సర్కారు వారి పాట మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే మంచి వసూళ్ళు వస్తున్నాయి. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!