Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె ముఖానికి కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు అవి ఉండటంతో.. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందేమో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పలానా వ్యక్తితోపెళ్లి కూడా ఫిక్స్ అంటూ నానా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా శ్రీలీల స్పందించింది. ఆ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కాదని క్లారిటీ ఇచ్చేసింది. తన ప్రీ బర్త్ డే వేడుకలు తన ఇంట్లో వారు సెలబ్రేట్ చేసినట్టు వెల్లడించింది.
Read Also : Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..
నా ప్రీ బర్త్ డే వేడుకలు ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. వాటిని మా అమ్మ దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ క్రెడిట్ మొత్తం మా అమ్మకే చెందుతుంది. అంటూ రాసుకొచ్చింది. జూన్ 12న ఆమె బర్త్ డే జరుపుకుంటోంది. అందులో భాగంగానే తమ సంప్రదాయం ప్రకారం ఇంట్లోన ప్రీ బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది ఈ బ్యూటీ. ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తోంది. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. ఆమె ఇప్పుడు 24వ పుట్టినరోజు జరుపుకుంటోంది. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోబోను అంటూ గతంలోనే ప్రకటించింది.
Read Also : Opal Suchata : ప్రభాస్ గురించి మిస్ వరల్డ్ సుచాత కామెంట్స్.. ఆ సినిమాపై రివ్యూ ఇస్తుందట..