ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్‌గా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. ప్రభాస్ సరికొత్త జానర్స్‌లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తు దూసుకుపోతున్నాడు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం ఒకరి కథతో మరొకరు సినిమా చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. రెండు భారీ కథలు ఈ ముగ్గురి చుట్టే తిరిగినట్టుగా ఉంది వ్యవహారం. లేటెస్ట్‌గా.. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో అనుకున్న కథను ఎన్టీఆర్ టేకప్ చేశాడు. గాడ్ ఆఫ్ వార్‌గా భారీ ఎత్తున మైథలాజికల్ టచ్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది.
Also Read: Sonam Raghuvanshi case: “నా చెల్లిని ఉరితీయాలి”.. సోనమ్ సోదరుడి డిమాండ్..
ఆయన కోసం బుచ్చిబాబు చాలా కాలం వెయిట్ చేశాడు. ఫైనల్‌గా.. ఈ కథను చరణ్ దగ్గిరికి ఎన్టీఆరే పంపించినట్టుగా టాక్. ఇప్పుడు.. అల్లు అర్జున్‌కు తెలియకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందా? అంటే, కాదని చెప్పలేం. ఎందుకంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ ముగ్గురి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంతర్గతంగా ఎన్ని గొడవలున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్యామిలీ కింద లెక్క. ఇక ఎన్టీఆర్, చరణ్‌కు మించిన క్లోజ్ ఫ్రెండ్స్ టాలీవుడ్‌లో లేరనే మాట ఉంది. అటు అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య బావ బావ అనుకునేంత బాండింగ్ ఉంది.
Also Read: Divi: నేనే తప్పూ చేయలేదు.. దయచేసి నా ఫోటోలు వాడకండి.. దివి విజ్ఞప్తి!
అలాంటప్పుడు ఈ ముగ్గురికి తెలియకుండా ఒకరి కథ ఇంకొకరి దగ్గరికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. లేదంటే.. ఈ ముగ్గురు పోటా పోటీగా సినిమాలు చేస్తున్నారనే చెప్పాలి. అయితే.. కథలే కాదు, ఈ ముగ్గురు కూడా ఒకరు చేసిన హీరోయిన్లతో మరొకరు సినిమా చేస్తున్నారు. కల్కిలో దీపిక పదుకొనే నటించగా.. ప్రభాస్ స్పిరిట్‌లోను తీసుకోవాలని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఫైనల్ అయింది దీపిక. అటు దేవర సినిమాలో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసిన జాన్వీ కపూర్‌తో.. ప్రస్తుతం పెద్దిలో రొమాన్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. మొత్తంగా.. ఈ ముగ్గురి మధ్య కథలే కాదు.. హీరోయిన్లు కూడా తిరుగుతున్నారనే చెప్పాలి.