సరిగ్గా ఒక నెల క్రితం హరిహర వీరమల్లు సినిమా అంటే పట్టించుకునే వారే లేరు. కేవలం అది ఒక పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే. అటు ఫ్యాన్స్ కూడా OG మత్తులో హరిహర వీరమల్లును లైట్ తీసుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నాలుగేళ్లుగా సెట్స్ పైనే ఉండడం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఉన్నకాస్త కూస్తో బజ్ కూడా పోయింది. అలానే అనేక మార్లు రిలీజ్ వాయిదా వేయడం, నిర్మాత థియేట్రికల్ రైట్స్ ను మరింత పెంచడంతో కొనేందుకు బయ్యర్స్ ముందు వెనక అన్నారు. కానీ ఇదంతా గతం.
Also Read : Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్.. ఓల్డ్ స్కూల్ కమర్షియల్ ట్రీట్
హరిహర వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నం కోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఫైనల్ కాపీ చూసి ప్రెస్ మీట్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అదే రోజు రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అంతే ఒక్కసారిగా హరిహర విరమల్లు బజ్ ఎక్కడికో వెళ్ళింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం టికెట్లు హాట్ కేకులయ్యాయి.. ఎన్ని థియేటర్లు పెంచినా అన్ని చోట్లా ఒకటే జోష్. పవన్ మానియాతో ఫ్యాన్స్ ఉగుతున్నారు. ఆంధ్ర మరియు నైజాంలో పవర్ స్టార్ తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ముఖ్యంగా కోనసీమ, ఉత్తరాంద్ర ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ లో హరిహర దూకుడు చూపిస్తోంది. నిన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న హరిహర పవర్ స్టార్ రాకతో విధ్వంసం చేస్తున్నాడు. ఒక్కోసారి ఆయన రావడం కాస్త ఆలస్యం అవ్వోచ్చేమో కానీ రావడం పక్కా. రికార్డులకు ఉండదు ష్యురీటీ బద్దలు కొట్టడం గ్యారెంటీ.